రూ.10వేల లోపు స్మార్ట్‌ఫోన్ల ధరలు..

- May 05, 2019 , by Maagulf
రూ.10వేల లోపు స్మార్ట్‌ఫోన్ల ధరలు..

రోజు రోజుకీ స్మార్ట్‌ఫోన్ల రేట్లు తగ్గుతుండడంతో అసలు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నిర్వచనమే మారిపోతోంది. ఒకప్పుడు రూ.20వేలకు పైగా ధర వెచ్చిస్తే గానీ లభించని ఫీచర్లు ఇప్పుడు రూ.10వేల లోపు లభిస్తున్న ఫోన్లలోనే అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో విడుదలైన అలాంటి టాప్ స్మార్ట్‌ఫోన్ల గురించి ఇప్పుడు చూద్దాం..

Samsung Galaxy M10: సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వచ్చింది. రియర్ కెమెరా 13+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,400 ఎంఏహెచ్. అలాగే 2జీబీ+16జీబీ, 3జీబీ+32జీబీ వేరియంట్లలోఅందుబాటులో ఉన్నాయి. ప్రాసెసర్ ఎక్సినోస్ 7870. 2జీబీ+16జీబీ ధర రూ.7,990, 3జీబీ+32జీబీ ధర రూ.8,990గా దీని ధర ఉంది.

Realme 2: నాచ్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ , బిగ్‌ బ్యాటరీ, ఫ్రంట్ కెమెరా హెచ్‌డీఆర్, ఏఐ బ్యూటిఫికేషన్ 2.0, రియల్ టైమ్ ఏఆర్ స్టిక్కర్స్, బొకే మోడ్, 4230 ఎంఏహెచ్ బిగ్‌ బ్యాటరీతో 44 గంటల పాటు వస్తుంది. 18 గంటల పాటు ఇంటర్నెట్ చూసుకోవచ్చు. 3 జీబీ + 32 జీబీ ధర రూ.9,499 కాగా 4 జీబీ + 64 జీబీ ధర రూ.10,990.

Nokia 5.1 Plus: 5.8 అంగుళాల డిస్‌ప్లే, 13+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ. 3జీబీ+32జీబీ ధర రూ.7,999 మాత్రమే.

Realme 3: రియల్‌మీ 3 ఫోనులో డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్, 3డీ గ్రేడియంట్ డిజైన్, కలర్ ఓఎస్ 6, రైడింగ్ మోడ్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఏఐ బ్యూటిఫికేషన్, 3జీబీ+32జీబీ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.10,999.

Realme C2: ఈ ఫోనులో 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌‌ప్లే, ఆక్టాకోర్ హీలియో పీ22, ట్రిపుల్ స్లాట్, స్లో మోషన్ ఫీచర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫెసిలిటీస్ వున్నాయి. 2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ.5,999 కాగా, 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999.

Samsung Galaxy M20: 6.3 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 13+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎక్సినోస్ 7904 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ ధర కూడా పదివేల లోపే.

Redmi Y3: రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరా, ఏఐ బ్యూటిఫై 4.0, లోలైట్ సెల్ఫీ, ఏఐ పోర్ట్‌రైట్ సెల్ఫీ, 360 డిగ్రీ ఏఐ ఫేస్ అన్‌లాక్, ఫుల్ హెచ్‌డీ సెల్ఫీ వీడియో రికార్డింగ్, షేక్-ఫ్రీ సెల్ఫీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 12+2 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ రియర్ కెమెరా, దీని ధర కూడా పదివేల లోపే

Asus Zenfone Max Pro M1: ఫుల్ హెచ్‌డీ+(2160 x 1080) ఎల్సీడీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీబీ+32 జీబీ ధర రూ.8,499 కాగా, 4జీబీ+64 జీబీ ధర రూ.10,499.

Redmi 7: 6.26 అంగుళాల హెచ్‌డీ+(1520×720 పిక్సెల్స్), 19:9 యాస్పెక్ట్ రేషియో, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 12+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ డ్యూయెల్ కెమెరా, ఏఐ పోర్ట్‌రైట్ మోడ్, ఫేస్ అన్‌లాక్, సెల్ఫీ టైమర్, ఏఐ స్మార్ట్ బ్యూటీ, గొరిల్లా గ్లాస్ ఇక రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ ధర రూ.7,999 కాగా, 3జీబీ+32జీబీ ధర రూ.8,999గా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com