ఇండియా:రైలు ప్రయాణికులకు శుభవార్త

- May 05, 2019 , by Maagulf
ఇండియా:రైలు ప్రయాణికులకు శుభవార్త

ప్రయాణికుకులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ. ఎవరైనా రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత ఎక్కే స్టేషన్ మార్చుకోవాలంటూ కనీసం 24 గంటల సమయం పడుతోంది. బోర్డింగ్ స్టేషన్‌లో ప్రయాణికులు రైలు ఎక్కకుంటే రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతోంది. దీనివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న తరువాత బోర్డింగ్ స్టేషన్ లో కాకుండా మరోచోట ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు బోర్డింగ్ స్టేషన్ మరోచోటుకి మార్చుకోవచ్చు.

ఇది ఆన్ లైన్ లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో వుంది. బుకింగ్ కౌంటర్ లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఈ సౌలభ్యం అందుబాటులో లేదు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ లో వెబ్ సైట్‌లో ఐడీ పాస్ వార్డ్ లాగిన్ అయ్యి …. బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్ళాలి. రైలును ఎంచుకొని బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. స్టేషన్ మార్చుకునే ప్రయాణికులకు, రెండు స్టేషన్లకూ మధ్య ఉన్న దూరానికి రైలు ఛార్జీ వెనక్కి రాదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com