దుబాయ్‌లో 'స్ట్రీట్ డాన్సర్' చిత్రీకరణ
- May 04, 2019
'ఏబీసీడీ 2' షో కో స్టార్స్ ఇప్పుడు డాన్స్ నేపథ్య చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ చిత్రమే 'స్ట్రీట్ డాన్సర్ 3డీ'. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్నారు. రిమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొత్త ఓ స్ట్రీట్ డాన్సర్ నృత్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చే విధంగా కథ ఉంటుందట. భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తర్వాత షెడ్యూల్ దుబాయ్ లో మొదలు పెట్టారు. వరుణ్ ధావన్, శ్రద్ధాతో పాటు ఈ సినిమా యూనిట్ మొత్తం దుబాయ్‌లో వాలిపోయింది. అక్కడ డిఫరెంట్ డాన్స్ స్టయిల్స్‌పై కసరత్తు చేస్తున్నారు. వారం రోజులు క్రితం దీనిపై కసరత్తులు చేశారు. ఇప్పుడు అక్కడ 15 రోజులు పాటు షూటింగ్ జరపనున్నారు. ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, లిజెల్ డిసౌజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభుదేవా, నోరా పాతేహి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఏడాది నవంబర్ 8వ తేదీన విడుదల కానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..