రమదాన్ ఫాస్టింగ్: బహిరంగ ప్రవేశాల్లో 'ఈటింగ్'కి జైలు శిక్ష
- May 06, 2019
కువైట్ సిటీ: పవిత్ర రమదాన్ మాసంలో ముస్లిం సోదరుల ఫాస్టింగ్ నేపథ్యంలో వారి సెంటిమెంట్లను దెబ్బతీసేలా బహిరంగా ఎవరైనా 'ఈటింగ్' చేపడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, ఈ మేరకు ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ బ్రిగేడియర్ జనరల్ అల్ కందారి చెప్పారు. చట్టం 44/1968 ప్రకారం, ఫాస్టింగ్ అవర్స్‌లో పబ్లిక్ ప్లేసుల్లో ఈటింగ్ నేరమని ఆయన వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించినవారికి 100 కువైటీ దినార్స్ జరీమానాతోపాటు 1 నెల జైలు శిక్ష కూడా పడే అవకాశం వుందని అన్నారు. ఇదిలా వుంటే, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో బెగ్గింగ్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. పబ్లిక్ మోరల్స్ దెబ్బతినకుండా పిల్లల్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని ఈ సందర్భగా బ్రిగేడియర్ జనరల్ అల్ కందారి, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..