చైనా ఉత్పత్తులపై 25 శాతం సుంకం పెంచనున్న అమెరికా

- May 06, 2019 , by Maagulf
చైనా ఉత్పత్తులపై 25 శాతం సుంకం పెంచనున్న అమెరికా

వాషింగ్టన్‌: అమెరికా, చైనాల మధ్య రోజు రోజుకీ వాణిజ్య పోరు ముదిరిపాకాన పడుతుంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా తీసుకున్న నిర్ణయంతో చైనా ఖంగుతింది. అమెరికాలో 200 బిలియన్‌ డాలర్ల విలువ చేసే చైనా వస్తువులపై సుంకం 25 శాతం పెంచుతున్నట్లు తేల్చి చెప్పారు. వాణిజ్య పోరుపై చర్చల కోసం బుధవారం నాడు అమెరికాకు చైనా బృందం రానుంది. ఐతే ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ సారి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

గత 10 నెలలుగా అమెరికాలో చైనా వస్తువులపై డ్రాగన్‌ కంట్రీ సుంకం కడుతూ వస్తుంది. 50 బిలియన్‌ డాలర్లు విలువ చేసే వస్తువులపై 25 శాతం సుంకం చెల్లిస్తుండగా, 200 బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఇతర వస్తువులపై 10 శాతం సుంకం చెల్లిస్తుంది చైనా. ఇక ఈ 10 శాతం వచ్చే వారం నుంచి 25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అమెరికా ఉత్పత్తులకు అధిక డిమాండు ఉన్నప్పటికి.ట్రంప్‌ మాత్రం క్షేత్రస్థాయిలో మార్పులు జరగాలని పట్టుబడుతున్నారు. అమెరికా కంపెనీలు తమ టెక్నాలజీని చైనాతో పంచుకోవాలని చైనా పదేపదే అమెరికాపై ఒత్తిడి పెంచడం సరికాదని ట్రంప్‌ అబిప్రాయపడ్డారు. చైనా విదేశీ సంస్థలపై అవలంబించే విధానాలను ట్రంప్‌ తప్పుబట్టారు. అందుకే చైనాపై ఒత్తిడి తెచ్చేందకు అమెరికాలోకి ప్రవేశిస్తున్న చైనా ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైనా ఉత్పత్తుల విలువ సుమారుగా 540 బిలియన్‌ డాలర్లు ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com