శత్రుత్వానికి సిల్వర్ స్క్రీన్ మీద శుభంకార్డు..
- January 01, 2016
హీరో తండ్రికి విలన్ కి మధ్య అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలో శత్రుత్వం ఉంటుంది. అది చిన్నప్పటి హీరో గుండెల్లో రగులుతూ ఉంటుంది. హీరో పెద్దయ్యాక.. మంచి ఫైట్లు నేర్చుకున్నాక.. క్లైమాక్స్ లో విలన్ ని చితకబాదో, చంపేసో తండ్రితో పాటు తన పగని తీర్చుకుంటారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కొన్ని వందల సినిమాలు ఇలాంటి కథలతో వచ్చాయి. వస్తున్నాయి. ఇకపై వస్తాయి కూడా.నిజ జీవితంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వెండితెర మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం అసలు రాదు. కానీ అలాంటి అవకాశం కావొచ్చు.. అదృష్టం కావొచ్చు. శివ రాజ్ కుమార్ కి దక్కింది. లెజండరీ సూపర్ స్టార్, ఆయన కొడుకు శివరాజ్ కుమార్.. గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ కి మధ్య ఉండే శత్రుత్వానికి సిల్వర్ స్క్రీన్ మీద శుభంకార్డు పడనుంది.2000వ సంవత్సరం జూలై 30న కన్నడ స్టార్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేశాడు వీరప్పన్. 100 రోజులకు పైగా తనదగ్గర బందీగా ఉంచుకుని చివరకు ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి, రాజ్ కుమార్ కుటుంబానికి, వీరప్పన్ కి మధ్య చాలా చర్చలు జరిగాయి. కానీ.. ఏదేమైనా చివరకు క్షేమంగా తిరిగొచ్చాడు. దీంతో అందరూ హ్యాపీ.తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో.. ఆ పాత పగను తీర్చుకునే అవకాశం రాజ్ కుమార్ కొడుకు శివ రాజ్ కుమార్ కు వచ్చింది. ఈ సినిమాలో వీరప్పన్ ని చంపే పోలీస్ గా నటించాడు శివరాజ్ కుమార్. దీన్నిబట్టి నిజజీవితంలో వీరప్పన్ తో ఏర్పడిన శత్రుత్వానికి నట జీవితంలో ముగింపు పలికాడు కన్నడ నటుడు. వర్మ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా తెలుగులో మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







