నేడు కేరళ వెళ్లనున్న కేసీఆర్

- May 06, 2019 , by Maagulf
నేడు కేరళ వెళ్లనున్న కేసీఆర్

భారత దేశవ్యాప్తంగా నాలుగు విడతల సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ సరళిని విశ్లేషించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీలకు అంతంత మాత్రంగానే సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఫలితాల తర్వాత ప్రధాన మంత్రిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలేనని ఒక అంచనాకు వచ్చిన ఆయన.. ఫెడరల్‌ ఫ్రంట్‌పై మరోసారి ఫోకస్ పెట్టారు. అందుకే ఇవాళ కేరళ వెళ్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు త్రివేండ్రంలో సీఎం పినరాయి విజయన్‌తో సమావేశం కానున్నారు.

పార్టీలు వేరైనా విజయన్‌తో కేసీఆర్ మంచి సంబంధాలున్నాయి. విజయన్ గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు అపూర్వ అతిథ్యం ఇచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు మరోసారి కేసీఆర్.. త్రివేండం వెళ్లి విజయన్ తో సమావేశం కానున్నారు. దేశరాజకీయాలపై ఆయనతో చర్చించనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటుపై విజయన్‌ తో మాట్లాడనున్నారు

కేసీఆర్ గతంలో ఫెడరల్‌ ఫ్రంట్‌పై వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. ఇప్పుడు కేరళ వెళ్లి విజయన్ తో భేటీ కానున్నారు. కేసీఆర్ విజయన్‌ తో చర్చల తర్వాత రామేశ్వరం, శ్రీరంగం ఆలయాలను సందర్శించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com