పేట్రోల్ ట్యాంకర్ పేలీ 58 మందికి పైగా దుర్మరణం
- May 07, 2019
ఆఫ్రికా దేశంలోని నైజర్‌లో పేట్రోల్ ట్యాంకర్ పేలి సుమారు 58మందికి పైగా మృత్యువాత పడ్డట్టు నైజర్ మంత్రిత్వశాఖ అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ ఘటనలో మరో 35 మంది వరకు తీవ్రగాయల పాలయ్యారని వారు తెలిపారు.
ఆఫ్రికా దేశంలోని నైజర్‌లో ఓ పెట్రోల్ లారీ రైల్వే ట్రాక్ దాటుతుండగా బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు ప్రజలు గుమికూడారు. పెట్రోల్ తీసుకెళుతున్న సమయంలోనే ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో పేట్రోల్ కోసం గుమికూడిన ప్రజలు మంటలకు అహూతయ్యారు. ట్యాంకర్ చుట్టు ఉన్నవాళ్లు అక్కడిక్కడే మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
కాగా మరి కొంతమందిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం పెద్ద ఎత్తున జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వారు తెలిపారు.కాగా ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న ఆస్థులకు పెద్ద నష్టం జరిగినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







