ఐడీ కార్డ్ దొంగతనం: అప్పీల్‌ని తిరస్కరించిన న్యాయస్థానం
- May 07, 2019
బహ్రెయిన్:హై అప్పీల్స్ కోర్ట్, బహ్రెయినీ వ్యక్తి అప్పీల్‌ని తిరస్కరించింది. రాబరీ, ఫ్రాడ్ కేస్కి సంబంధించి ఓ బహ్రెయినీ వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించగా, దాన్ని సదరు వ్యక్తి హై అప్పీల్స్ కోర్ట్‌లో సవాల్ చేయగా, అక్కడ అతనికి తిరస్కారం ఎదురయ్యింది. జుఫ్ఫైర్లో పార్క్ చేసిన ఓ కారు నుంచి ఐడీ కార్డ్‌ని దొంగిలించిన నిందితుడు, దాని ద్వారా వాహనాన్ని లీజ్‌కి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కాగా, అంతకు ముందు అనుమానితుడు రెంట్ ఎ కార్ కంపెనీ నుంచి కారుని అద్దెకి తీసుకుని, తిరిగి సదరు సంస్థకు ఇవ్వకుండా తప్పించుకు తిరగడంతో అసలు వ్యవహారమంతా వెలుగు చూసింది. ఐడీ కార్డ్ దొంగిలించబడిందని గుర్తించిన పోలీసులు, దాని ద్వారా నిందితుడ్ని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







