తండ్రి ఆత్మహత్య: ప్రత్యేక పరిస్థితుల్లోనూ మంచి మార్కులు సాధించిన విద్యార్థిని
- May 08, 2019
బహ్రెయిన్:పదవ తరగతి విద్యార్థిని శ్రేయ, 2018-19 ఏడాది సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌లో 88 శాతం మార్కులు సంపాదించుకుంది. ఇటీవలే ఆమె తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రేయ, ఆమె సోదరి బహ్రెయిన్‌లో విద్యనభ్యసిస్తున్నారు. తాను పనిచేస్తున్న ప్రాంతంలోనే వీరి తండ్రి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. శ్రేయ తల్లి ఇండియాలో వున్నారు. శ్రేయ సోదరుడు క్యాన్సర్‌తో వైద్య చికిత్స పొందుతుండడంతో, తల్లి తన కుమారుడి వద్దనే వుంది. ఇన్ని సమస్యల నడుమ శ్రేయ, బోర్డ్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన స్నేహితురాలు గౌరి, ఆమె కుటుంబం ఆర్థిక సహాయం అందించడంతో శ్రేయ, ఆమె సోదరి బహ్రెయిన్‌లోనే విద్యనభ్యసిస్తున్నారు. ఇండియన్ ఎంబసీ, సోషల్ వర్కర్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ వీరికి అండదండలు అదిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







