విండోస్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు..!
- May 08, 2019
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇకపై విండోస్ ఫోన్లలో పనిచేయదని ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31 తరువాత విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వారు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ ఫోన్లకు డిసెంబర్లో సపోర్ట్‌ను నిలిపివేయనున్న నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సాప్ తెలిపింది. కాగా ఫిబ్రవరి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్ 2.3.7, ఐఓఎస్ 7 అంత కన్నా తక్కువ వెర్షన్ ఓఎస్‌లు ఉన్న డివైస్‌లలోనూ వాట్సాప్ పనిచేయదని ఆ కంపెనీ చెబుతున్నది. అయితే విండోస్ ఫోన్లు, డెస్క్‌టాప్‌ల కోసం త్వరలోనే యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ఫాం పేరిట ఓ కొత్త వాట్సాప్ వెర్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనుందని తెలుస్తున్నది..!
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







