విండోస్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు..!

- May 08, 2019 , by Maagulf
విండోస్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇకపై విండోస్ ఫోన్లలో పనిచేయదని ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31 తరువాత విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వారు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ ఫోన్లకు డిసెంబర్‌లో సపోర్ట్‌ను నిలిపివేయనున్న నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సాప్ తెలిపింది. కాగా ఫిబ్రవరి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్ 2.3.7, ఐఓఎస్ 7 అంత కన్నా తక్కువ వెర్షన్ ఓఎస్‌లు ఉన్న డివైస్‌లలోనూ వాట్సాప్ పనిచేయదని ఆ కంపెనీ చెబుతున్నది. అయితే విండోస్ ఫోన్లు, డెస్క్‌టాప్‌ల కోసం త్వరలోనే యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ఫాం పేరిట ఓ కొత్త వాట్సాప్ వెర్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనుందని తెలుస్తున్నది..!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com