గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన 'దుబాయ్ ఫ్రేమ్'
- May 11, 2019
దుబాయ్‌లో ప్రముఖ ఎట్రాక్షన్స్‌లో ఒకటైన దుబాయ్ ఫ్రేమ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. 'పిక్చర్ ఫ్రేమ్‌లో అతి పెద్ద బిల్డింగ్'గా రికార్డు సొంతం చేసుకుంది. 150.24 మీటర్ల ఎత్తుతో ఈ ఘనతను సాధించింది దుబాయ్ ఫ్రేమ్. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్పెక్టాక్యులర్ పనోరమిక్ వ్యూస్ ఈ నిర్మాణం ప్రత్యేకత. దుబాయ్ పాస్ట్, ప్రెజెంట్ మరియు ఫ్యూచర్‌ని ప్రతిబింబించేలా ఈ భవనం నుంచి వ్యూ వుంటుంది. దుబాయ్ ఫ్రేమ్ సందర్శించాలనుకునేవారికి 'గిన్నీస్ రికార్డ్' మరో ఆహ్వానించదగ్గ కారణమని అంటున్నారు నిర్వాహకులు. పెద్దలకు 50 దిర్హామ్‌లు, పిల్లలకు 20 దిర్హామ్‌లతో దుబాయ్ ఫ్రేమ్‌లోకి ప్రవేశం లభిస్తుంది. 3 ఏళ్ళలోపు చిన్నారులకు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకు అలాగే పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కీ ఉచితంగానే ఇందులో ప్రవేశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల