ఇఫ్తార్ హోస్టింగ్ ఎంతో సంతృప్తికరం: క్రిస్టియన్ వలసదారుడు
- May 11, 2019
ఫుజైరా కి చెందిన భారత వలసదారుడు సాజి చెరియన్, యూఏఈలో ఓ మసీదు నిర్మించడమే కాక, ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు సేవ చేసుకునే భాగ్యం తనకు కలిగిందని క్రిస్టియన్ అయిన సాజి చెరియన్ చెప్పారు. బ్లూ కాలర్ వర్కర్స్ కోసమే అన్ని అనుమతులూ తీసుకుని మసీదు నిర్మించినట్లు చెప్పారాయన. ఫుజైరా చేరుకోవాలంటే 20 నుంచి 30 దిర్హామ్‌లు ట్యాక్సీ ఫేర్ చెల్లించాల్సి వుంటుందనీ, అలా డబ్బు వెచ్చించలేని వారి కోసమే మసీదు నిర్మించానని అన్నారు చెరియన్. ఎయిర్ కండిషన్డ్ కన్వెన్షన్ సెంటర్‌ని నిర్మించి, అక్కడే వందలాది మంది కార్మికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. 2004లో చెరియన్ దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన విజయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఇప్పుడాయన ఓ వ్యాపార వేత్తగా ఎదిగారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల