ఇండియాలో యూఏఈ డ్రైవింగ్‌ క్లాసులు

ఇండియాలో యూఏఈ డ్రైవింగ్‌ క్లాసులు
దుబాయ్‌: ఇండియాలో త్వరలో యూఏఈ డ్రైవింగ్‌ క్లాసులు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్లాసులకు అటెండ్‌ అయ్యేవారికి శిక్షణ తర్వాత సర్టిఫికెట్‌ అందజేస్తారు. యూఏఈకి వెళ్ళిన వెంటనే టెయిలర్‌ మేడ్‌ కింద లైసెన్స్‌ పొందడానికి మార్గం సుగమం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాల్లో డ్రైవింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ని ఏర్పాటు చేసి, అక్కడ యూఏఈ నిబంధనల ప్రకారం శిక్షణ ఇస్తారు. ఇండియాకి చెందిన నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎమిరేట్స్‌ డ్రైవింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అలాగే యూత్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌పై సంతకాలు చేయడం జరిగింది. యూఏఈలో డ్రైవింగ్‌ పొందాలనుకునేవారికి అక్కడ ఎదురయ్యే ప్రత్యేక పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేలా ఈ కొత్త విధానం వుండబోతోందని ఎన్‌ఎస్‌డిసి సీఈఓ మరియు ఎండీ మనీష్‌ కుమార్‌ చెప్పారు. 

Back to Top