ఒమన్‌లో గాయపడ్డ కార్మికుడికి ఇండియన్ ఎంబసీ సాయం
- May 17, 2019
మస్కట్: ఒమన్‌లో గాయపడ్డ భారతీయ వలస కార్మికుడికి సాయం అందించేందుకు ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీ ముందుకొచ్చింది. ఒమన్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న రాజేంద్రప్రసాద్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది ఇండియన్ ఎంబసీ. అలాగే, ప్రసాద్‌కి సాయం అందించేందుకు ఇండియన్ కమ్యూనిటీకి చెందిన సోషల్ మరియు వెల్ఫేర్ వర్కర్స్ సాయం చేయాలని కోరింది. ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇండియన్ కమ్యూనిటీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఆయనకు సహాయం అందించేందుకు సిద్ధంగా వున్నామని చెప్పారు. రాజేంద్రప్రసాద్‌కి ఇప్పటికే కొన్ని శస్త్ర చికిత్సలు జరిగాయనీ, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







