అబుధాబి: విమానంలో వ్యక్తి మృతి.. అత్యవసర ల్యాండింగ్
- May 15, 2019
అబుధాబి: విమానంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. దీంతో ఢిల్లీ నుంచి మిలాన్ వెళ్తున్న విమానం అత్యవసరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ల్యాండ్ అయ్యింది. మృతుడు కైలాష్ చంద్ర షైనీ(52) రాజస్తాన్‌కు చెందిన వాడని ఖలీల్ టైమ్స్ వెల్లడించింది. అతడు తన కొడుకు హీరా లాల్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడని పేర్కొంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎంబసీ ధ్రువీకరించింది.
కాగా ఈ విషయం గురించి ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ రాజమురుగన్ మాట్లాడుతూ.. అలీటాలియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో కైలాష్ సోమవారం రాత్రి మరణించాడని పేర్కొన్నారు. ఈ కారణంగా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని, అతడి శవాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఇతిహాద్ విమానంలో బాడీని బుధవారం భారత్‌కు పంపిస్తామని వెల్లడించారు. ఇదొక దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం