దోహా - బౌండ్ అల్ షమాల్ రోడ్ మూసివేత
- January 02, 2016
పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గాల్) అల్ షమాల్ రోడ్‌కి సంబంధించి 500 మీటర్ల మేర రోడ్డుని మూసివేయనుంది. తాత్కాలికంగా ఈ మూసివేత అమల్లోకి రానుంది. సుమారు 4 నెలలపాటు ఈ రోడ్డుని మూసివేస్తారు. ఆదివారం నుంచి రోడ్డును మూసివేయనున్నట్లు అధికారుల వెల్లడించారు. రోడ్డు మూసివేతతో నార్త్ బౌండ్ క్యారేజ్ వే వైపుగా వాహనాలను డైవర్ట్ చేస్తారు. డైవర్షన్ కారణంగా రోడ్లుపై 60 కిలోమీటర్ల వరకు వేగ నియంత్రణ అమల్లోకి తెస్తారు. బ్రిడ్జ్ నిర్మాణం కోసమే తాత్కాలికంగా రోడ్డును మూసివేస్తున్నామనీ, అష్గాల్ వాహనదారులకోసం డైవర్షన్ సూచీ, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. భద్రతా కారణాల రీత్యా వేగాన్ని తగ్గించుకుని వాహనదారులు తమ వాహనాల్ని నడపవలసిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









