యూఏఈలో భారీ వర్షాలు: గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు?

- May 20, 2019 , by Maagulf
యూఏఈలో భారీ వర్షాలు: గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు?

ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో యూఏఈ వాసులు ఆనందంతో తడిసి ముద్దయ్యారు. ఈ భారీ వర్షం కారణంగా, యూఏఈలో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల వరకు తగ్గే అవకాశాలున్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. దేశంలోని వెస్ట్రన్‌ పార్ట్‌లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. 6 డిగ్రీల వరకు ఇక్కడ తగ్గుదల నమోదయ్యింది. ఇతర ప్రాంతాల్లోనూ గణనీయంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే తగ్గినట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది సాధారణ వర్షాలు కురిసే అవకాశం వుందనీ వింటర్‌ నుంచి సమ్మర్‌కి మారే ఈ సమయంలో ఇలాంటి వర్షాలు కురిసే అవకాశాలుంటాయని ఎన్‌సిఎం అధికారులు విశ్లేషించారు. ఎండల తీవ్రత తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టాక తిరిగి ఎండల తీవ్రత కొనసాగుతుందని అంటున్నారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com