తమిళ రీమేక్ తో హీరో రామ్ కొత్త సినిమా!
- May 20, 2019
రామ్ పోతినేని కి సరైన హిట్ లేక బాధ పడుతున్నాడు. "నేను శైలజ" అనే సినిమా తరువాత చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ లేదు. తరువాత వచ్చిన "ఉన్నది ఒక్కటే జిందగీ" సినిమా కు మంచి ఆధరణ లభించినా, సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో రామ్ చాతికెల పడిపోయాడు. హిట్ కోసం చాల ఆశగా ఏడురుచుస్తున్నాడు ఈ హీరో.
"దేవదాసు" సినిమా తో రామ్ పోతినేని కి మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. తన సరసన చేసిన ఇలయానా కి కుడా దేవదాసు సినిమా తరువాత పెద్ద స్టార్ రేంజ్ కి వెళ్ళిపోయింది. దేవదాసు తరువాత రామ్ చాల సినిమాలు చేసాడు కొన్ని పెద్ద హిట్స్ , మరి కొన్ని యావరేజ్ అయ్యాయి. అయితే ఒకేసారి "నేను శైలజ" సినిమా తరువాత గ్యాప్ రావడంతో ఒక్కసారి గా రామ్ వెనకపడిపోయాడు.
రామ్ లేటెస్ట్ గా "ఇస్మార్ట్ శంకర్" అనే సినిమా తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా వరుస పరాజయాలతో భాధడుతున్న మన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో రాబోతుంది. ఈ సినిమా ను పూరి తన సొంత బ్యాన్నేర్ అయిన "పూరి కనెక్ట్ " పై చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కు ప్రముఖ హీరోయిన్ ఛార్మి కూడా పెట్టుబడి పెట్టినట్లు సమాచరం.
తాజాగా ఈ సినిమా మేకర్స్ "ఇస్మార్ట్ శంకర్" టిజర్ ను రిలీజ్ చేసారు. ఈ టిజర్ ప్రేక్షకులను బాగా అలరించింది. టిజర్ లో మంచి మాస్ లుక్ లో కనిపించాడు రామ్. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమా పై భారి అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా రామ్ ఇంకో కొత్త సినిమా కు సంతకం చేసాడట. ఈ సినిమా కిశోరే తిరుమల దర్శకత్వం లో రాబోతుంది. ఈ డైరెక్టర్ రామ్ తో "నేను శైలజ" ఉన్నది ఒక్కటే జిందగీ" సినిమాలు తీసాడు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







