పీఎంఎస్‌బీవై ఇన్సూరెన్స్ స్కీం..
- May 20, 2019
ఏ ప్రమాదమూ తెలిసి జరగదు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అక్కరకొస్తాయి ఇన్సూరెన్స్ పాలసీలు. అందుకే జీవిత బీమా, ఆరోగ్య బీమాతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలజీ తీసుకుంటే ఉత్తమం. ప్రభుత్వం కూడా సామాజిక భద్రత నేపథ్యంలో పలు స్కీములు అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బావై) ఒకటి. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ పాలసీ కొంత ఆర్థిక ధైర్యాన్ని ఇస్తుంది.
పీఎంఎస్‌బావై యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పాలసీ వ్యవధి సంవత్సరము. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. స్కీమ్‌లో జాయిన్ అయ్యే ముందే ఆటో డెబిట్ ఫెసిలిటీ ఏర్పాటు అంగీకారం తెలపాలి. అంటే మీ అకౌంట్ నుంచి పాలసీ ప్రీమియం ప్రతి ఏడాది ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. పాలసీ ప్రీమియం ఏడాదికి రూ.12. మే 25 నుంచి 31 మధ్య కాలంలో పాలసీ ప్రీమియం మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు పాలసీ కవర్ వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా రూ.2 లక్షలు లభిస్తాయి. అదే పాక్షిక అంగవైకల్యానికి అయితే రూ.1 లక్ష వస్తుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







