దుబాయ్‌లో ముగ్గురు స్కామర్స్ అరెస్ట్
- May 21, 2019
ముగ్గురు సభ్యులుగల స్కామర్స్ ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ముందుంచారు. అక్రమంగా వందలాది సిమ్ కార్డుల్ని జారీ చేసినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. అరెస్టయినవారిలో ఒకరు మొబైల్ ఓనర్. వినియోగదారుడి అనుమతి లేకుండా, అతని పేరు మీద సిమ్‌కార్డ్స్‌ని నిందితుడు జారీ చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులో సాక్షి ఓ ఆఫ్రికన్ వర్కర్. సిమ్ కార్డ్ కోసం తాను ఓ షాప్‌కి వెళ్ళగా, అక్కడ తనకు సిమ్‌కార్డ్ లభ్యం కాలేదనీ, ఆ తర్వాత ఆరా తీస్తే, తన పేరు మీద తనకు తెలియకుండా సిమ్‌కార్డులు జారీ అయినట్లు తేలిందని బాధితుడు చెప్పారు. ఇలాంటి స్కామ్ ద్వారా పలు స్కామ్స్‌కి నిందితులు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఇతరుల నుండి డబ్బులు గుంజుతున్నట్లు తేల్చిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..