ఎన్నారై అలర్ట్: 2016 ఉద్యోగావకాశాలు
- January 02, 2016
2016లో హైరింగ్ యాక్టివిటీలో 7 శాతం వృద్ధి నమోదవుతుందని ప్రముఖ 'ఉద్యోగావకాశాల' వెబ్‌సైట్లు అంచనా వేస్తున్నాయి. ఔట్ లుక్ సర్వే 1614 సంస్థల్లో సర్వే చేసిన ఫలితాల్ని వెల్లడించింది. వీటిల్లో సుమారు 60 శాతం సంస్థలు పాజిటివ్ హైరింగ్ యాక్టివిటీ పట్ల సానుకూలంగా స్పందించాయి. ప్రధానంగా ఐటీ, టెలికాం మరియు మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో వృద్ధి ఎక్కువగా వుండొచ్చని అంచనా వేస్తున్నారు. 2016లో పై మూడు విభాగాల్లో ఎక్కువ హైరింగ్ కనిపించవచ్చు. ఐటీ, టెలికాం రంగాల్లో హైరింగ్ 25 శాతం కాగా, మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో 20 శాతం వుంటుందని అంచనా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ 17 శాతం, హెల్త్ కేర్ రంగంలో 17 శాతం హైరింగ్ వుండొచ్చు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రోగ్రామ్స్ దేశంలో కొత్త కొలువులకు అవకాశం కల్పించినట్లుగా చెప్పవచ్చు. సేల్స్ మరియు మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కి డిమాండ్ బాగా వుంటుంది. మిడిల్ లెవల్ మేనేజర్స్‌కీ ఈ సంవత్సరం మంచి అవకాశాలు లభించనున్నాయి. పురుషులతో పోల్చితే మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ఎక్కువ సంస్థలు మొగ్గు చూపుతున్నాయని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







