'సూపర్ 30' రిలీజ్‌ డేట్

'సూపర్ 30' రిలీజ్‌ డేట్

హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్‌ 30'. ఎట్టకేలకు ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. జులై 12 చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్వీట్‌ చేసింది. మొదట కంగనా రనౌత్‌ చిత్రం 'మెంటల్‌ హై క్యా', 'సూపర్‌ 30' చిత్రాలను జులై 26న విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. 'అనవసరమైన మెంటల్‌ టార్చర్‌ భరించలేకే నా సినిమాను వాయిదా వేస్తున్నాను. కొత్త విడుదల తేదీని నిర్మాతలు పకటిస్తారు' అని హృతిక్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించి కంగన చిత్రం కంటే ముందే విడుదల చేస్తున్నారు. గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్‌ జీవితంగా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

Back to Top