మోదీ పర్యటనపై మాల్దీవుల మీడియా ప్రకటన

మోదీ పర్యటనపై మాల్దీవుల మీడియా ప్రకటన

భారీ ఆధిక్యతతో రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే వారం మాల్దీవులకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన పాల్గొనే తొలి ద్వైపాక్షిక సమావేశం ఇదే. జూన్ 7, 8 తేదీల్లో ఆయన మాల్దీవుల్లో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మోదీ పర్యటన గురించి మాల్దీవుల మీడియా కూడా ప్రకటించింది. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోదీకి ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. సోలిహ్ 2018 నవంబరులో దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. 2014లో మొదటిసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ అదే ఏడాది జూన్‌లో తొలి విదేశీ పర్యటన జరిపారు. ఆయన ముందుగా భూటాన్ వెళ్ళారు.

Back to Top