ఇఫ్తార్ మీల్స్ పంచిన సిక్కు సమాజం
- May 29, 2019
బహ్రెయిన్‌లో సిక్కు సమాజం ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. 'సచ్ సునాయి సచ్ ది బెలా' - సిక్ గురుద్వారాస్ బహ్రెయిన్ నేతృత్వంలో ఇఫ్తార్ మీల్స్ పంపిణీ సల్మానియాలో జరిగింది. బహ్రెయిన్‌లోని అన్ని సిక్ గురుద్వారాస్ ఒక్కతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సచ్ సునాయి ది బెలా ప్రెసిడెంట్ జగిర్ సింగ్ చెప్పారు. సిక్కు సమాజం మొత్తంగా 200 ఇఫ్తార్ మీల్స్‌ని సల్మానియాలోని మస్జిద్ కాంప్లెక్స్‌లో పంపిణీ చేసినట్లు తెలిపారాయన. రెండు కమ్యూనిటీస్ మధ్య స్నేహ భావం మరింత పెంపొందేలా ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన వివరించారు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాల్ని మరింత ఘనంగా చేపట్టబోతున్నట్లు కనూ గార్డెన్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ రాకేష్ శర్మ చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







