ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- January 02, 2016
సకల జనుల సమ్మె కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సాధారణ సెలవు (స్పెషల్ కాజువల్ లీవ్)గా ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జేఏసీ పిలుపు మేరకు టీఎన్జీఓలు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24వ వరకు 'సకల జనుల సమ్మె'ను నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీ మేరకు ఈ సమ్మె కాలాన్ని ప్రత్యేక సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్ ఉద్యోగులందరికీ దీనిని వర్తింపజేశారు.కాగా, మల్టీ జోనల్, స్టేట్ కేడర్ ఉద్యోగుల విషయంలో మాత్రం వారి తుది కేటాయింపులకు లోబడి ప్రత్యేక సెలవులను వర్తింపజేయనున్నారు.సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల సెలవుల ఖాతాల్లో సమాన సంఖ్య గల సెలవులను పునరుద్ధరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన తుది తీర్పులకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిటైరైన ఉద్యోగులు, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పెన్షన్‌లో బకాయి కింద చెల్లింపులు చేయనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







