వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఎం.ఇ.సి.
- January 02, 2016
ఖతర్ లో 2015 ఏడాది లో ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వినియోగదారుల పరిరక్షణ శాఖ ( ఎం.ఇ.సి.) మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నట్లు సంబంధిత శాఖ పేర్కొంది. స్థానిక అరబిక్ దినపత్రిక ఆర్రయహ్ తెలిపిన వివరాల ప్రకారం , గత ఏడాది 537 వినియోగదారుల ఉల్లంఘనలు జరగ్గా, అందులో 48 వాణిజ్య సముదాయాలను వివిధ కాలాల్లో మూసివేయడం జరిగింది. మూసివేయబడిన వాటిలో బాగా ప్రసిద్ధి పొందిన ముఖ్య కార్ల పంపిణీధారులు సైతం ఉండటం గమనార్హం.వినియోగదారుల పరిరక్షణ శాఖ నివేదిక మేరకు ఈ కార్ల పంపిణీదారులు పాత కార్ల విడి భాగాలను మరమ్మతులు చేసి , వాటికి రంగులు పులిమి కొత్త కార్లగా బ్రమింప చేసి అమ్మకాలను జరిపినట్లు పరిశీలనలో తేలింది. వీరు ఈ తరహ కార్ల అమ్మకాలలోని అసలు నిజం అటు ప్రభుత్వానికి గాని, ఇటు వినియోగదారునికి గాని తెలియచెప్పలేదు. వీరి వ్యాపారంలో ఒక మోసపూరితమైన విధానంను భీతి లేకుండా కొనసాగిస్తున్నట్లు వినియోగదారుల పరిరక్షణ శాఖ పరిగణించింది. వినియోగదారులకు నష్ట నివారణ చర్యలు చేపట్టమని తాము ఆయా కార్ల పంపిణీధారులను కోరగా, వీరిలో అత్యధికులు తాము ఇచ్చిన సూచనను మనస్పూర్తిగా అంగీకరించలేదన్నారు.ఆ విధంగా చేస్తే , తాము కార్ల వినియోగదారుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతామని చెప్పి వారు అందుకు అంగీకనించ లేదు. దీనితో ఖతర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో కార్ల పంపిణీధారుల కపటం కట్టడి కాబడింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







