నేడు హీరో కృష్ణ పుట్టినరోజు... మహేశ్ 26వ చిత్రం టైటిల్ రివీల్ చేస్తూ టీజర్!
- May 31, 2019
నేడు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం. తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకుని, టాలీవుడ్ ప్రిన్స్ గా దూసుకెళుతున్న మహేశ్ బాబు, తన తాజా చిత్రం 'మహర్షి'తో మరో హిట్ ను అందుకుని, అదే ఊపుతో తన 26వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. నేడు కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేశ్ 26వ చిత్ర టైటిల్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' అని పేరును పెట్టినట్టు టీజర్ లో కృష్ణ స్వయంగా చెప్పారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అవుతుందని అన్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక టీజర్ ను తయారు చేసిన విధానం ఆకర్షిస్తోంది. మహేశ్ హీరోగా తెరంగేట్రం చేసిన 'రాజకుమారుడు' నుంచి 25వ చిత్రం 'మహర్షి' వరకూ అన్ని సినిమా పేర్లనూ చూపుతూ చివర్లో టైటిల్ ను రివీల్ చేశారు. ఇక టైటిల్ పక్కనే ఓ తుపాకి, దానిపై ఆర్మీ క్యాప్ ఉండటంతో, చిత్ర కథ ఆర్మీ నేపథ్యంలో ఉండవచ్చని అనిపిస్తోంది
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..