తప్పిపోయిన బాలిక క్షేమం
- May 31, 2019
బహ్రెయిన్:16 ఏళ్ళ బాలిక బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిందని ఆమె తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, విచారణ చేపట్టిన పోలీసులు, ఎట్టకేలకు బాలిక ఆచూకీ కనుగొన్నారు. ప్రస్తుతం బాలిక క్షేమంగా వున్నట్లు అధికారులు వెల్లడించారు. బాలిక పేరు షహాద్ అనీ, ఆమె అరబ్ జాతీయురాలనీ పోలీసులు పేర్కొన్నారు. రిఫ్ఫా పోలీస్ స్టేషన్లో బాలిక తప్పిపోవడంపై ఫిర్యాదు నమోదు కాగా, సోషల్ మీడియా వేదికగా పోలీసులు బాలిక ఫొటోల్ని ఆమెకు సంబంధించిన సమాచారాన్ని ప్రచారం చేశారు. బాలిక ఇంటర్మీడియట్ స్కూల్ (9వ గ్రేడ్) ఎగ్జామ్స్ ఇటీవలే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







