200 మంది కార్మికులకు ఇఫ్తార్ ఇచ్చిన చిన్నారులు
- June 01, 2019
అబుధాబి:కొంతమంది చిన్నారులు గ్రూప్‌గా ఏర్పడి, ముస్సాఫాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. 20 మంది చిన్నారుఉల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అందులోనూ మెజార్టీ చిన్నారులు నాన్ ముస్లింలు కావడం మరో విశేషం. ఇండియన్ సోషల్ అండ్ కల్చర్ సెంటర్ (ఐఎస్‌సి)కి చెందిన చిన్నారుల విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ అనుశ్రీ, వైస్ ప్రెసిడెంట్ హరిశంకర్ మరియు చీఫ్ కో-ఆర్డినేటర్ పూజ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సిటీ నుంచి 90 నిమిషాల బస్ జర్నీ తర్వాత లేబర్ అకామడేషన్‌కి చేరుకున్నామని, మాస్క్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇది తమకు చాలా గొప్ప అనుభవమనీ చిన్నారులు చెప్పారు. వారితో కలిసి ఫాస్టింగ్‌ని ముగించామని చిన్నారులు వివరించారు. పేరెంట్స్ డైరెక్షన్‌లో పిల్లలు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల లేబరర్స్ కూడా హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..