'రాక్షసుడు' టీజర్ విడుదల
- June 01, 2019
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ 'రాక్షసుడు' సినిమాను రూపొందిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసి .. వాళ్లపై అత్యాచారం చేసి హత్య చేసే ఒక సైకో, ఆ సైకోను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే ప్రయత్నాలతో ఈ టీజర్ కొనసాగింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూలై 18వ తేదీన విడుదల చేయనున్నారు. 'సీత' ఫలితంతో నిరాశ చెందిన బెల్లంకొండకి ఈ సినిమా ఊరట కలిగిస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







