మాజీ ఎంపీ మురళీమోహన్ ని పరామర్శించిన చిరంజీవి
- June 01, 2019
ప్రముఖ సీనియర్ నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మే 14న వారణాసిలో తన తల్లి అస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వెన్నముకకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే వెన్నముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన... వారం రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. నిన్న రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మురళీమోహన్... ప్రస్తుతం తన నివాసంలో కోలుకుంటున్నారు. మురళీమోహన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి దంపతులు... ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ మేరకు మురళీమోహన్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన అభిమానులతోపాటు రాజమండ్రి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, త్వరలోనే ప్రజలను కలుసుకునేందుకు రాజమండ్రి రానున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..