యూఏఈలో ప్రారంభమైన 'ఈద్‌ అల్‌ ఫితర్‌' సంబరాలు

యూఏఈలో ప్రారంభమైన 'ఈద్‌ అల్‌ ఫితర్‌' సంబరాలు

యూఏఈ:వేలాది మంది ముస్లిం డివోటీస్‌, మాస్క్‌ల వద్దకు చేరుకుని ప్రత్యేక ఈద్‌ ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. ఈద్‌ అల్‌ ఫితర్‌ తొలి సన్‌ రైజ్‌ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించేందుకు పెద్దయెత్తున ముస్లిం డివోటీస్‌ మసీదుల వద్దకు చేరుకున్నారు. ఈ రోజు సవ్వాల్‌ తొలి రోజుగా బావిస్తున్నారు. యూఏఈ మూన్‌ సైటింగ్‌ కమిటీ - అబుదాబీ జ్యుడీషియల్‌ డిపార్ట్‌మెంట్‌ వద్ద మీటింగ్‌ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ యూఏఈ ప్రజలు అలాగే ఇతర ఇస్లామిక్‌ దేశాల్లోని ప్రజలకు ఈద్‌ అల్‌ ఫితర్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సహా పలువురు ప్రముఖులకు మినిస్టర్స్‌ మెంబర్స్‌ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యావత్‌ ముస్లిం సమాజానికీ ఈద్‌ అల్‌ ఫితర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

Back to Top