ఆకట్టుకుంటున్న 'సూపర్ 30' ట్రైలర్
- June 04, 2019బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ 30'. బిహార్‌కు చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ స్థాపించిన 'సూపర్30' అనే ఐఐటీ శిక్షణ సంస్థ నేపథ్యంలో ఈ సినిమాను వికాస్ బెహెల్ తెరకెక్కించారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.
'భారత్.. ఓ చీప్ లేబర్ దేశం అంటుంటారు. మరి పెప్సికో సంస్థకు అధినేతగా వ్యవహరించింది ఎవరు?యూనిలివర్ సంస్థను ఎవరు నడిపిస్తున్నారు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలీకపోతే గూగుల్‌లో వెతకండి. అంతేకాదు గూగుల్‌ను శాసిస్తోంది ఎవరో కూడా అందులోనే తెలుసుకోండి. వీరందరూ మన భారతీయులే కదా' అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఇందులో ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ ఒదిగిపోయారు. ఆయన్ను ఓ విద్యా సంస్థ ఐఐటీ ప్రొఫెసర్‌గా నియమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన విద్యా సంస్థలో ఉద్యోగం మానేసి సొంతంగా కోచింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఏటా 30 మంది ఉత్తమ విద్యార్థులకు ఉచితంగా ఐఐటీలో కోచింగ్ ఇస్తుంటారు. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి?అన్నదే ఈ సినిమా కథ. జులై 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్