సౌదీ అరేబియా రాజును అవమానపరిచిన ఇమ్రాన్!
- June 06, 2019
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోషల్ మీడియాలో విపరితమైన విమర‍్శలు వస్తున్నాయి. ఆయన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను అవమానపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ ప్రొటోకాల్‌ను కూడా ఉల్లఘించారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత వారం సౌదీ ప్రభుత్వం మక్కాలో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరైన ఇమ్రాన్ సౌదీ రాజు వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు. అనంతరం వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. సౌదీ రాజుతో పక్కనే ట్రాన్స్‌లేటర్ ఇమ్రాన్ చెప్పే సందేశాన్ని ఆయనకు వివరిస్తున్నారు. అయితే చివర్లో ఇమ్రాన్ చెప్పిన మాటలు ట్రాన్స్‌లేటర్ రాజుకు వివరించలోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే సౌదీ రాజుతో మాట్లాడేటప్పుడు ఇమ్రాన్ బాడీ లాంగ్వేజ్ సరిగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇమ్రాన్ ప్రవర్తన కారణంగా ఆ తర్వాత సౌదీ, పాక్‌ల మధ్య జరగాల్సిన సమావేశం రద్దయిందని పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. 57 దేశాలు సభ్యత్వం ఉన్న ఓఐసీ ప్రపంచంలోని ముస్లింల కోసం పనిచేస్తున్నట్టు ప్రకటించుకుంది
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..