‘దొరసాని’ టీజర్ కు అద్భుతమైన స్పందన
- June 06, 2019
రియలిస్టిక్ లవ్ స్టోరీగా రాబోతోన్న సినిమా ‘దొరసాని’.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో కాగా.. యాంగ్రీ యుంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
సరేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం టీజర్ లోనే హైలెట్ గా కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ వర్మ సంగీతం సమకూర్చారు.. చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







