హువాయ్‌ ఐసిటి గ్లోబల్‌ ఫైనల్‌లో సత్తా చాటిన బహ్రెయిన్‌ విద్యార్థులు

- June 07, 2019 , by Maagulf
హువాయ్‌ ఐసిటి గ్లోబల్‌ ఫైనల్‌లో సత్తా చాటిన బహ్రెయిన్‌ విద్యార్థులు

బహ్రెయినీ విద్యార్థులు హువాయ్‌ ఐసిటి కాంపిటీషన్‌ ఫైనల్‌లో సత్తా చాటారు. చైనాలోని షెన్‌జెన్‌లో జరిగిన ఈ పోటీల్లో బహ్రెయిన్‌ టీమ్‌ మూడో ర్యాంక్‌ని సొంతం చేసుకుంది. ఎఎంఎ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ బహ్రెయిన్‌కి చెందిన మఖాట్రోనిక్స్‌ ఇంజనీరింగ్‌ - బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ విద్యార్థి వలీద్‌ యూసుఫ్‌, మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ఈ ఘనతను దక్కించుకున్నారు. చైనాలోని షెన్‌జాన్‌లో మే 25, 26 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు టీమ్స్‌ ఈ పోటీల్లో పాల్గొన్నాయి. హువాయ్‌ ఐసిటి కాంపిటీషన్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఇన్‌ చైనాకి సంబంధించి గత ఏడాది వాలీద్‌ అతని టీమ్‌ రెండో స్థానం దక్కించుకుంది. హువాయి ఐసిటి కాంపిటీషన్‌కి 61 దేశాల నుంచి, 1,600 కాలేజీలకు చెందిన 100,000 స్టూడెంట్స్‌ హాజరయ్యారు ఈ ఏడాది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com