సదరన్‌ గవర్నరేట్‌లో అగ్ని ప్రమాదం

- June 08, 2019 , by Maagulf
సదరన్‌ గవర్నరేట్‌లో అగ్ని ప్రమాదం

బహ్రెయిన్: శనివారం ఉదయం సదరన్‌ గవర్నరేట్‌ పరిధిలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సివిల్‌ డిఫెన్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం అల్‌ మోస్కార్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే, సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది తక్షణం స్పందించి, మంటల్ని అదుపు చేశారు. ఓ ఎలక్ట్రిక్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సివిల్‌ డిఫెన్స్‌ వివరించింది. అయితే ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోయినట్లుగానీ, ఎవరూ గాయపడినట్లుగానీ సమాచారం అందలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com