ఒమన్‌లో భారీ వర్షాలు
- January 03, 2016
ఒమన్‌లో భారీ వర్షాలుఒమన్లోని ముసాందమ్, బురైమి గవర్నరేట్స్ పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. ఖసాబ్ ప్రావిన్స్‌లోని వాదిస్, ముసాందామ్లోని మఖా, మరియు బిబ్బా ప్రాంతాలు వర్షపు నీటితో వాహనదారులకు ఇబ్బందిగా పరిణమించాయి. ఈ భారీ వర్షాలతో ఇప్పటివరకూ ఎలాంటి మరణాలూ చోటు చేసుకోలేదని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అధికారులు వెల్లడించారు. ఒమన్ ఉత్తర ప్రాంతాలైన దక్లియా, దహరి మరియు మస్కట్ గవర్నరేట్స్ పరిధిలో మధ్యస్థం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లోనివారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







