పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్
- June 10, 2019
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీని సోమవారం పాక్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై మనీలాండరింగ్ కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఆయన హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న అలీ నిర్వహిస్తున్న లావాదేవీలపై నేషనల్ అకౌంటబిలిటి బ్యూరో(అవినీతి నిరోధక శాఖ) అధికారులు నిఘా ఉంచారు. అంతేకాకుండా ఆయన కంపెనీలకు చెందిన పలు అకౌంట్ల ద్వారా సోదరితో కలిసి సుమారు 150 మిలియన్ డాలర్ల నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఆ అకౌంట్లు నకిలీవిగా గుర్తించిన దర్యాప్తు అధికారులు అలీతో పాటు ఆయన సోదరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







