లేబర్ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం: 22 మంది క్షేమం
- June 11, 2019
రస్ అల్ ఖైమాలోని ఓ లేబర్ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా అందులో వున్న 22 మంది కార్మికుల్ని రక్షించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎయిర్ కండిషనర్, ఇతర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయని అధికారులు పేర్కొఆన్నరు. అల్ ఉరైబి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే, ఫైర్ ఫైటర్స్‌ని, రెస్క్యూ టీమ్స్‌ని రస్ అల్ ఖైమా పోలీస్ విభాగం సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే, ఆపరేషన్ ప్రారంభించిన ఫైర్ ఫైటర్స్, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వాటర్ మరియు ఫోమ్ వినియోగించి, మంతల్ని అదుపు చేశారు. ఈ క్రమంలోనే 22 మంది కార్మికుల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు ఫైర్ ఫైటర్స్.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







