డబ్ల్యు మస్కట్‌ హోటల్‌ ప్రారంభం

- June 11, 2019 , by Maagulf
డబ్ల్యు మస్కట్‌ హోటల్‌ ప్రారంభం

మస్కట్‌: ఒమన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కంపెనీ (ఒమ్రాన్‌), డబ్ల్యు మస్కట్‌ హోటల్‌ని బుధవారం, జూన్‌ 12న ప్రారంభించనుంది. టూరిజం విభాగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించే క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ ఎంతో కీలకం కాబోతోందని ఒమన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కంపెనీ ప్రతినిథులు చెబుతున్నారు. బీచ్‌ సైడ్‌లో రాయల్‌ ఒపెరా హౌస్‌ మస్కట్‌ పక్కనే ఈ హోటల్‌ని నిర్మించారు. మొత్తం 279 ఫైవ్‌ స్టార్‌ రూమ్స్‌ ఇందులో ప్రధాన ఆకర్షణ. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఈ హోటల్‌ని నిర్మించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. టూరిస్టులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే రీతిలో ఇక్కడ సేవలు అందుతాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com