బ్యాంకాక్ వీధుల్లో బట్టలు అమ్ముకుంటున్న బాహుబలి డ్యాన్సర్..
- June 11, 2019
సినిమాల్లో అవకాశాలు వస్తే నటిస్తూ.. తనపనేదో తానుచేసుకుంటోంది నటి నోరా ఫతేహీ. ఎవరి దగ్గరా చేయి చాచకుండా ఏపనైనా గౌరవంగా చేసి డబ్బులు సంపాదించుకుంటోంది. రాజమౌళి చెక్కిన బాహుబలి చిత్రంలో మనోహరి అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. తన అంద చందాలతో, అభినయంతో ప్రేక్షకులను అలరించిన నోరా జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ చిత్రంలో ఇట్టాగే రెచ్చిపోదాం అనే పాటకి స్టెప్పులేసింది. రవితేజ కిక్-2 టైటిల్ సాంగ్‌లో ఆడి పాడింది. మరికొన్ని చిత్రాలు షేర్, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించింది. ఈ ఇండో-కెనడా మోడల్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తను చేసిన వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్యాంకాక్‌లోని ఓ మార్కెట్లో నేల మీద కూర్చుని దుస్తులు అమ్ముతోంది. స్థానిక భాషలోనే మాట్లాడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







