15,000 కిలోల పేపర్‌ వేస్ట్‌ని కలెక్ట్‌ చేసిన 8 ఏళ్ళ చిన్నారి

15,000 కిలోల పేపర్‌ వేస్ట్‌ని కలెక్ట్‌ చేసిన 8 ఏళ్ళ చిన్నారి

8 ఏళ్ళ ఎకో వారియర్‌, సుమారు 15,000 కిలోల పేపర్‌ వేస్ట్‌ని దుబాయ్‌లో కలెక్ట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎమిరేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ గ్రూప్‌ - నేషనల్‌ వైడ్‌ రీసైక్లింగ్‌ క్యాంపెయినింగ్‌ సందర్భంగా భారతీయ విద్యార్థిని నియా టోనీ ఈ ఘనతను సాధించింది. ఈ క్రమంలో 22వ ఎడిషన్‌ ఎమిరేట్స్‌ రీసైక్లింగ్‌ అవార్డుని కూడా గెల్చుకుంది నియా టోనీ. ఈ క్యాంపెయిన్‌ ద్వారా ఎమిరేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ గ్రూప్‌, ప్రాజెక్టడ్‌ కార్బన్‌ ఎమిషన్స్‌ని కనీసం 73,393 మెట్రిక్‌ టన్నుల మేర తగ్గించగలిగింది. కార్పొరేషన్స్‌, అకడమిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఇండివిడ్యుయల్స్‌ / ఫ్యామిలీస్‌ అనే మూడు కేటగిరీల కింద ఎకో ఫ్రెండ్లీ డ్రైవ్‌ని నిర్వహించారు. పేపర్‌, ప్లాస్టిక్‌, గ్లాస్‌, క్యాన్స్‌, మొబైల్స్‌ అండ్‌ టోనర్స్‌ని కలెక్ట్‌ చేయడం ల్యంగా పెట్టుకున్నారు. టోనీ, పేపర్‌ సెక్షన్‌లో ఇండివిడ్యువల్‌ కేటగిరీలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది. మొత్తం 14,914 కిలోల పేపర్‌ వేస్ట్‌ సేకరించిందామె. 

 

Back to Top