ఫిల్మ్ న్యూస్ జర్నలిస్ట్‌లకు మెగాస్టార్ చేయూత
- June 12, 2019
ఫిల్మ్ జర్నలిస్ట్ లకు సినిమా పరిశ్రమకు ఎంతటి అవినాభావ సంబంధం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తోన్న ఫిల్మ్ జర్నలిస్ట్ లు అంతా కలిసి 2004లో ‘ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ నుంచి వివిధ ఎలక్ట్రానిక్ మీడియంలలో పనిచేస్తోన్న జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఫిల్మ్ జర్నలిస్ట్ లతో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం హెల్త్ కార్డ్స్ ను ఇప్పించారు. అసోసియేషన్ లోని సభ్యుల సమస్యల కోసం నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందీ సంస్థ. ఫిల్మ్ జర్నలిస్ట్ ల కోసం నిజాయితీగా పనిచేస్తోన్న ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందాన్ని మెగాస్టార్ చిరంజీవిగారు తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించారు. అంతే కాకుండా ఈ సంస్థ కోసం కొంత ఆర్థిక సాయాన్ని కూడా చేసి తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ బృందంతో గంటకు పైగా చర్చలు జరిపారు. భవిష్యత్ లో ఈ ఆర్గనైజేషన్ వేసే ప్రతి అడుగులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంటికి పిలిచి మరీ సాయం చేసిన మెగాస్టార్ కు ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







