దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- July 17, 2026
దుబాయ్: దుబాయ్‌కు సంబంధించిన తప్పుడు వార్తలు లేదా ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచురించే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం (Government of Dubai Media Office - GDMO) హెచ్చరించింది.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో, దుబాయ్ ఎమిరేట్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అమల్లో ఉన్న చట్టాలు, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా తప్పుడు సమాచారం ప్రచురించే మీడియా సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మీడియా సంస్థలు, ప్రజలు వార్తలు మరియు సమాచారాన్ని అధికారిక, విశ్వసనీయ వర్గాల నుంచే పొందాలని జీడీఎంఓ సూచించింది. ఏ సమాచారాన్నైనా ప్రచురించే లేదా సోషల్ మీడియాలో పంచుకునే ముందు దాని నిజానిజాలను తప్పనిసరిగా ధృవీకరించాలని కోరింది.
అలాగే పుకార్లు, తప్పుడు వార్తలు, ధృవీకరణ లేని కథనాలను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలు, ప్రజలకు దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







