విచిత్ర సమస్య ఎదుర్కొంటున్న రీల్ 'రాహుల్ గాంధీ'
- June 12, 2019
`ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్` చిత్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాత్రను పోషించిన అర్జున్ మాథుర్ గుర్తున్నాడా? అతనికి ఓ చిత్రమైన సమస్య ఎదురైంది. సినిమా హీరోలకు అమ్మాయిల నుంచి లవ్ లెటర్స్, మ్యారెజ్ ప్రపోజల్స్ రావడం సాధారణ విషయమే. అయితే అర్జున్‌కు మాత్రం అలాంటి ప్రపోజల్స్ అబ్బాయిల నుంచి వస్తున్నాయట.
అబ్బాయిల నుంచి ప్రపోజల్స్ రావటం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? దానికి కారణం అర్జున్ నటించిన ఓ వెబ్ సిరీసే. `మేడ్ ఇన్ హెవెన్` అనే వెబ్ సిరీస్‌లో అర్జున్ స్వలింగ సంపర్కుడిగా నటించాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాతే అబ్బాయిల నుంచి అసభ్యకర సందేశాలు వస్తున్నాయని అర్జున్ వాపోతున్నాడు. `నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?` అంటూ అబ్బాయిల నుంచి మెసేజ్‌లు రావడం చాలా ఇబ్బందిగా ఉందని వెల్లడించాడు. తన నటనకు ప్రశంసలు అందుతున్నప్పుడు ఆనందంగానే ఉన్నా.. ఈ పెళ్లి ప్రపోజల్స్ ఏమిటంటూ అర్జున్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నటించే పాత్రలను.. నిజ జీవితాన్ని కలిపి చూడొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..