సునీల్ హీరోగా 'ఈడు గోల్డ్ ఎహే
- January 04, 2016
ఒక హీరోయిన్ కంటే ఇద్దరైతే లక్ అని భావించారో ఏమో గానీ.. సునీల్ హీరోగా 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాకు ఇద్దరు హీరోయిన్లను పెట్టారు. సుష్మా రాజ్, రిచా పనాయ్.. ఈ ఇద్దరు అమ్మాయిలు సునీల్ సరసన నటిస్తారని సినిమా వర్గాలు తెలిపాయి.పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'ఈడు గోల్డ్ ఎహే'. ఇందులో హీరోయిన్లిద్దరినీ ఇటీవలే కన్ఫమ్ చేశామని, ఈ సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు.సినిమాను రెండు నెలల్లో పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈలోపు సునీల్ హీరోగా నటించిన మరో సినిమా 'కృష్ణాష్టమి' విడుదల కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







