ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
- June 14, 2019
ఎక్సర్సైజ్ : చాలామంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అయితే, ఈ సమయంలో అతిగా చేయకూడదు.. ఎందుకంటే సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. శరీరం త్వరగా అలసిపోతుంది. ముఖ్యంగా ఉదయం మాత్రమే ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ శరీరం రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి.. ఎక్సర్సైజ్ విషయంలో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.
స్నానానికి ముందు మసాజ్ : ఈ సమయంలో స్నానాని02కి ముందు శరీరాన్ని కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. కొన్ని పరిశోధనల్లో ఈ మసాజ్‌తో జీర్ణసమస్యలు కూడా తగ్గిపోతాయని తేలింది.
అతిగా వేడి, చల్లని పదార్థాలు తీసుకోకపోవడం : ఈ సమయంలో ఎక్కువగా వేడి, చల్లగా ఉన్న డ్రింక్స్, ఫుడ్‌ని తీసుకోకపోవడం మంచిది. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఐస్ వాటర్, జ్యూస్‌లు తాగుతుంటారు. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. కాబట్టి.. ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
కాఫీ, టీలు తగ్గించడం : అసలే మండే ఎండలు.. అందులోనూ కాఫీ, టీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి.. ఈ విషయంలోనూ జాగ్రత్తపడడం ముఖ్యం.
జంక్ ఫుడ్ తగ్గించడం : గ్రిల్డ్ ఫుడ్, చిప్స్, చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. దీనివల్ల శరీరంలో వేడి పెరుగుతుంది.
పండ్లు తీసుకోవడం : వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. పుచ్చకాయలు, దోసకాయలు, బ్రకోలి ఇలాంటి వాటిని తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో నీటిశాతం పెరిగుతుంది.
రాత్రి పడుకునే ముందు మసాజ్ : రాత్రి పడుకునే ముందు కూడా ఏవైనా అరోమా ఆయిల్స్ అంటే శాండిల్, జాస్మిన్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌తో బాడీ మసాజ్ చేస్తుండాలి. ఒకవేళ వీలుకాకపోతే.. హెడ్ మసాజ్ అయినా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల స్ట్రెస్ పూర్తిగా తగ్గుతుంది. మరునాటి ఉదయానికి మనం చాలా యాక్టివ్‌గా ఉంటాం.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









